కూకట్పల్లి, వెలుగు: హరిద్వార్‌కు చెందిన దివ్య ప్రేమ్సేవా మిషన్న్యాస్సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్‌లో ‘చక్రవ్యూహ్’ పేరుతో నాటకం వేస్తున్నారు. సంస్థ నిర్వాహకులు సోమవారం సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్మాట్లాడుతూ హరిద్వార్కేంద్రంగా లెప్రసీ పేషెంట్స్ కు చికిత్స, వారి పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్న ప్రేమ్ సేవా మిషన్ సేవలు అభినందనీయమన్నారు.
సేవా సంస్థపై అవగాహన కల్పించడానికి సిటీలో ఏర్పాటు చేస్తున్న నాటకాన్ని సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. 28 ఏండ్లుగా హరిద్వార్‌లో లెప్రసీ పేషెంట్స్ కు చికిత్స, దాదాపు 600 మంది చిన్నారులకు ఉచిత విద్య అందిస్తున్నామని, గంగా నది ప్రక్షాళన, ప్లాంటేషన్, పారా మెడికల్ విభాగాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 26న సాయంత్రం 4 గంటలకు జేఎన్టీయూలో చక్రవ్యూహ్ నాటకం మొదలవుతుందని, మహాభారత్ సీరియల్లో శ్రీకృష్ణుడిగా నటించిన నితీశ్భరద్వాజ్శ్రీకృష్ణుడి పాత్ర పోషించనున్నారని తెలిపారు.