
సిద్దిపేట జిల్లా: చిట్టాపూర్ బావిలో పడిన కారును వెలితీయబోయి ప్రమాదవశాత్తు చనిపోయిన నర్సింహ డెడ్ బాడీని వెలికి తీశారు పోలీసులు. దీంతో స్థానికులు, గ్రామస్తులు భారీగా స్పాట్ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రామయంపేట- సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేలేదన్నారు. దీంతో స్పందించిన RDO అనంతరెడ్డి .. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు... డబుల్ బెడ్ రూం ఇళ్లు... ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.