
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్వరంగల్సిటీలో అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ(యూజీడీ)పై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో బల్దియా మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఇంజనీరింగ్ఆఫీసర్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్మాట్లాడుతూ.. యూజీడీ రూపకల్పనపై జోన్ల వారీగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, మాధవిలత తదితరులు ఉన్నారు.