
షాద్‌నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల దగ్గర దారుణ ఘటన
రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌రో దారుణం జరిగింది. చాటాన్ పల్లి గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తుండగా... మట్టి దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఫరూక్ నగర్ మండలం ఉప్పరి గడ్డ తండాకు చెందిన శ్రీను, కృష్ణయ్య గా గుర్తించారు.
కొత్తగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువను 20 అడుగుల లోతున తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేస్తామన్నారు.