కరీంనగర్ టౌన్,వెలుగు: నిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగాలు సొంతమవుతాయని తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. కరీంనగర్ లోని శాతవాహన వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్ మెంట్ సొసైటీ సంయుక్తంగా శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు చీఫ్ గెస్ట్ ఆయన హాజరై వీసీ ప్రొ. ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ సతీశ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
పోటీ ప్రపంచంలో ముందుండాలంటే ఎప్పటికప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. మెగా జాబ్ మేళాలో 821మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూకు హాజరు కాగా, 247 మందిని ఎంపిక చేసినట్లు, అందులోంచి 198 మందికి జాబ్ నియామకపత్రాలు అందించినట్టు వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. వర్సిటీ ప్లేస్ మెంట్ ఆఫీసర్ ఈ. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
