ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షలు చోరీ

ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షలు చోరీ

కౌడిపల్లి, వెలుగు : ఆర్టీసీ బస్సులో వెళ్తున్న దంపతుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 5 లక్షలు చోరీ చేశారు. కామారెడ్డి జిల్లా గోపాల్‌‌‌‌పేటకు చెందిన రెహనా బేగం, షఫీ దంపతులు ఇటీవల గ్రామంలో ఇల్లు కొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌‌‌‌ షాపూర్‌‌‌‌నగర్‌‌‌‌లోని తమ బంధువుల వద్ద రూ. 5 లక్షలు తీసుకుని వాటిని బ్యాగ్‌‌‌‌లో పెట్టుకొని బాన్స్‌‌‌‌వాడ డిపోకు చెందిన ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్‌‌‌‌లో గోపాల్‌‌‌‌పేటకు బయలు దేరారు. 

నర్సాపూర్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌ వద్దకు చేరుకోగానే రెహానా బేగం డబ్బులు ఉన్న బ్యాగ్‌‌‌‌ను పక్కన పెట్టి పిల్లాడిని ఎత్తుకుంది. వెంకట్రావుపేట గేటు దాటిన తర్వాత పక్కకు చూసే సరికి బ్యాగ్‌‌‌‌ కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి కౌడిపల్లి బస్టాండ్‌‌‌‌లో బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేసినా బ్యాగ్‌‌‌‌ దొరకలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్‌‌‌‌ వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. నర్సాపూర్‌‌‌‌ నుంచి బస్సులో ప్రయాణించిన వ్యక్తులను సీసీ పుటేజీ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.