హైదరాబాద్ లో ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో యువతి డెడ్ బాడీ కలకలం..

హైదరాబాద్ లో ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో యువతి డెడ్ బాడీ కలకలం..

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో నగ్నంగా యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. రాజేంద్రనగర్ లోని కిస్మత్ పూర్ లో బ్రిడ్జి కింద యువతి డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. మంగళవారం ( సెప్టెంబర్ 16 ) కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద ఒంటి నూలుపోగు లేని స్థితిలో ఉన్న యువతి డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. యువతిని దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. 

మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్ళ లోపు ఉండచ్చని భావిస్తున్నారు పోలీసులు. యువతి మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ గా భావిస్తున్నారు పోలీసులు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలు సేకరించారు. 

యువతిని బ్రిడ్జి కిందికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. యువతిని ఎవరు హత్య చేసి ఉంటారు, ఈ హత్యకు గల కారణాలు వంటి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.