గౌహతిలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం 

V6 Velugu Posted on May 14, 2022

అసోంలోని గౌహతిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టుప్రాంతాల్లో మోకాళ్ల వరకు నీళ్లు వచ్చాయని తెలిపారు స్థానికులు. భారీ వర్షానికి హతిగావ్, చాంద్ మరి, జూ రోడ్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహన రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే సహాయక చర్యలుచేపట్టాలని కోరారు స్థానికులు.

 


 

Tagged assam, rain, Guwahati, continuous rain

Latest Videos

Subscribe Now

More News