దేశంలో సౌర విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత

దేశంలో సౌర విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత

దేశంలో విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ లో సోలార్​ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు కేటాయించారు. దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం కోసం 4 పైలట్‌ ప్రాజెక్టులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

అలాగే పర్యావరణానికి ప్రాముఖ్యమిస్తూ.. ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం రూపొందించి.. పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 
భారత్‌ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడిందని పార్లమెంటులో ప్రస్తావించిన ఆమె ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు, మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయిస్తున్నట్లు వివరించారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు, గిఫ్ట్‌ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం కల్పిస్తామన్నారు. స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు ఉంటుందన్నారు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన జరుగుతుందనన్నారు.