తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ .. రెండు నేషనల్ హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ .. రెండు నేషనల్ హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
  • తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • హెచ్ఏఎం పద్ధతిలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్63లో ఆర్మూర్– -జగిత్యాల– -మంచిర్యాల ప్రాజెక్ట్
  • బీఓటీ పద్ధతిలో జగిత్యాల- –కరీంనగర్ నాలుగు లేన్ల విస్తరణ
  • ఆయా రోడ్ల విస్తరణతో తగ్గనున్న ప్రయాణ సమయం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రెండు నేషనల్ హైవేల అభివృద్ధి, విస్తరణకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే(ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్)-63లోని ఆర్మూర్ – జగిత్యాల –-మంచిర్యాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎంఏ), ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్–-563లోని జగిత్యాల -–కరీంనగర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను నాలుగు లేన్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.7,597.16 కోట్ల భారీ అంచనా వ్యయంతో మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులను మూడు ప్యాకేజీలలో నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. జనసాంద్రత, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు బైపాస్‌‌‌‌‌‌‌‌లు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన డిజైన్, ఓపెన్ టోలింగ్ విధానంతో ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ ప్రాజెక్టులతో ఆర్మూర్ –మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట 30 నిమిషాలు, జగిత్యాల –కరీంనగర్ మధ్య 45 నిమిషాలు తగ్గనుందని తెలిపింది. ఈ నిర్మాణ పనుల ద్వారా స్థానికంగా 34.43 లక్షల పని దినాల ప్రత్యక్ష ఉపాధి, 42.7 లక్షల పని దినాల పరోక్ష ఉపాధి లభించనుంది.

ఆర్మూర్ –జగిత్యాలలో 63.60 కి.మీ. విస్తరణ..

నేషనల్ హైవే-–63 అభివృద్ధిలో భాగంగా మొత్తం రెండు విభాగాలుగా పనులు జరగనున్నాయి. ఇందులో ఆర్మూర్ –జగిత్యాలకు సంబంధించి 63.60 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎం) పద్ధతిలో చేపట్టనున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా సాగే ఈ రహదారిలో అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల వంటి పట్టణాల్లో నివాస ప్రాంతాల కారణంగా తీవ్ర రద్దీ ఎదురవుతున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలగనుందని పేర్కొంది. ఈ లైన్ మొత్తం పొడవు 63.60 కి.మీ కాగా, ఇందులో 17.95 కి.మీ బ్రౌన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్, 45.65 కి.మీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ రహదారిగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్యాకేజీ వ్యయం రూ.2,471.76 కోట్లుగా పేర్కొంది. ఇందులో సివిల్ పనులకు రూ.1,266.58 కోట్లు, భూ సేకరణ, ఇతర ముందస్తు పనులకు రూ.504.26 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. కాగా... రాయితీ కాలం 17.5 ఏండ్లుగా (2.5 ఏండ్ల నిర్మాణ సమయం, 15 ఏండ్ల నిర్వహణ) నిర్ణయించింది. 

 జగిత్యాల– మంచిర్యాలలో 68.295 కి.మీ..

ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ –63లోనే రెండో విభాగం కింద జగిత్యాల- –మంచిర్యాలకు సంబంధించి మొత్తం 68.29 కి.మీ మేర విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో బ్రౌన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ కేవలం 2.05 కి.మీ, గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ 66.10 కి.మీలుగా ఉంది. దీని మొత్తం వ్యయం రూ.2,730.72 కోట్లు కాగా, సివిల్ పనులకు రూ.1,477.17 కోట్లు, భూ సేకరణకు రూ.436.93 కోట్లు కేటాయించారు. దీనిని సైతం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలోనే 17.5 ఏండ్ల రాయితీ కాలంతో నిర్మిస్తారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు సగటున 12,084 వాహనాల (పీసీయూ) రాకపోకలు సాగుతున్నాయి. ఈ లైన్‌‌‌‌‌‌‌‌తో జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోని ప్రాంతాలను కలపనున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల వంటి ప్రాంతాల్లోని నివాసాలు, వ్యాపార సముదాయాల వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు ప్రయాణ సమయం పెరుగుతున్నట్లు పేర్కొంది. 
జగిత్యాల –కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58.86 కి.మీ..
నేషనల్ హైవే –563లోనే జగిత్యాల –-కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మొత్తం 58.86 కి.మీ మేర విస్తరణ పనులకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్న జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ పరిసరాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడంతో నిరంతరం భారీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 58.86 కి.మీ పొడవునా జరగనున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో బ్రౌన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ పద్ధతిలో 24.14 కి.మీ, గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ పద్ధతిలో 34.96 కి.మీ రహదారిని నిర్మించనున్నారు. దీని మొత్తం వ్యయం రూ.2,394.68 కోట్లు కాగా, సివిల్ పనులకు రూ.1,455.01 కోట్లు, భూ సేకరణకు రూ.394.53 కోట్లు వెచ్చిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విభాగాన్ని బిల్డ్ ఆపరేట్ -ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ టోల్ (బీవోటీ టోల్) పద్ధతిలో 20 ఏండ్ల రాయితీ కాలంతో (2.5 సంవత్సరాల నిర్మాణ కాలంతో కలిపి) చేపట్టనున్నట్లు తెలిపింది. 

ఆధ్యాత్మిక హబ్‌‌‌‌‌‌‌‌లకు ఊతం.. 

ఈ ప్రాజెక్టులతో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంతో పాటు నాగునూర్ కోట, లోయర్ మానేరు డ్యామ్, ఖిల్లా కోట వంటి ఏడు సామాజిక నోడ్‌‌‌‌‌‌‌‌లకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ప్రయాణం సుఖమయం కానుందని కేంద్రం వెల్లడించింది. అలాగే, పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ సూచనలకు అనుగుణంగా పలు ప్రయోజనాలను చేకూర్చేలా రూపొందించినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, వరంగల్ అర్బన్ సెజ్‌‌‌‌‌‌‌‌లు, నిజామాబాద్, సిద్దిపేట మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్ల ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్ల వంటి ఐదు ఆర్థిక నోడ్‌‌‌‌‌‌‌‌లకు మెరుగైన రవాణా వసతి లభించనుంది.