నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం

నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం
  • హాజరు కానున్న అమిత్ షా, నిర్మలా, రాజ్నాథ్, మన్స్ఖ్ మాండవీయ
  • ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ

ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ ఈ రోజు సాయంత్రం సమావేశంకానుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ  సమావేశం ప్రారంభం కానుంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి మన్స్ఖ్ మాండవీయతో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బడ్జెట్‌ పై ముఖ్యంగా చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపై కూడా కేంద్ర కేబినేట్‌ చర్చించే చాన్స్‌ ఉంది. కరోనా గురించి కూడా కేబినేట్ డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇక రెండో దశ పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేబినేట్ లో చర్చించే అవకాశం ఉంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతులను తిరిగి ఎలా ప్రసన్నం చేసుకోవాలనే అంశంపై కూడా కేబినేట్ చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీలైనంత మేరకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు పెంచి రైతులను ఆకట్టుకునేందుకు కావాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాగా కిందటి సారి కేంద్ర కేబినేట్ సమావేశం జనవరిలో జరిగింది. ఆ సమావేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 15 నుంచి 18 సంవత్సరాల బాల బాలికలకు కరోనా వ్యాక్సిన్, 60 ఏళ్లకు పైబడిన వారికి మూడో డోస్ వంటి పలు అంశాల గురించి చర్చించి ఆమోదం తెలిపింది. 

ఇవి కూడా చదవండి: 

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం