- కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి
- రాజ్ భవన్ హైస్కూల్ సందర్శన
హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణ, పట్టుదల, కృషితోనే విద్యార్థులు లక్ష్యాలను చేరుకోగలరని కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా కార్యక్రమాల అమలు తీరు, డిజిటల్ లర్నింగ్ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కేంద్ర కార్యదర్శికి ఇక్కడి విద్యా విధానాలను, నూతన కార్యక్రమాలను వివరించారు.
పర్యటనలో భాగంగా ఆయన ఏఎక్స్‌ఎల్ ల్యాబ్, డిజిటల్ లర్నింగ్ ఏఐ ల్యాబ్‌ను పరిశీలించారు. ప్రీప్రైమరీ స్టూడెంట్ల డెవలప్మెంట్ కు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. రాజ్ భవన్ స్కూల్ నిర్వహణ ఆకట్టుకుందని, డిజిటల్ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.
