పరిమితులకు లోబడే విదేశీ అప్పులు : నిర్మలా సీతారామన్​

పరిమితులకు లోబడే విదేశీ అప్పులు : నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: విదేశీ అప్పులు అనుమతించదగ్గ స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎక్స్​టర్నల్​ డెట్​ సర్వీస్​ రేషియో 5.3 శాతం ఉందన్నారు. మొత్తం అప్పు  624.7 బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు.  ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన 'ఇండియాస్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్ డెట్: ఎ స్టేటస్ రిపోర్ట్ 2022–-23'కి ఆమె ముందుమాట రాశారు. 

జీడీపీకి విదేశీ అప్పుల నిష్పత్తి మార్చి- చివరి నాటికి 20 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గింది. దీర్ఘకాలిక అప్పు మొత్తం విదేశీ అప్పులో 79.4 శాతంగా ఉంది. అయితే మొత్తం విదేశీ అప్పుల్లో 20.6 శాతం స్వల్పకాలిక అప్పు దిగుమతులకు ఆర్థిక సహాయం చేస్తుంది.  2022–-23లో  డెట్​సర్వీస్​  నిష్పత్తి  అంతకుముందు సంవత్సరంలో 5.2 శాతం నుంచి 5.3 శాతానికి స్వల్పంగా పెరిగింది.  డెట్​ సర్వీస్​ చెల్లింపులు 2021-–22లో  41.6 బిలియన్ డాలర్ల నుంచి 2022–23 నాటికి  49.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.