బూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం

బూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ 6 నెలలకు తగ్గించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్టర్ మధ్య గ్యాప్ 9 నెలలుగా ఉంది. ఈ వ్యవధిని కేంద్రం 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు రెండో డోస్ కొవిడ్ టీకా తీసుకున్న  6 నెలలకు బూస్టర్ డోస్ తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వహకులకు లేఖ రాశారు.