బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ..కీలకాంశాలపై చర్చ

బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ..కీలకాంశాలపై చర్చ

బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. 19మంది ముఖ్యనేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు టార్గెట్ గా అమిత్ షా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దని నేతలకు అమిత్ షా ఆదేశించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించినట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో ఊరికి ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అమిత్ షాతో భేటీ అయిన వారిలో బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, అర్వింద్, రఘునందన్ రావు, రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ ఉన్నారు. 

అమిత్ షాతో గోపిచంద్ సమావేశం

మరోవైపు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అమిత్ షాను కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిశానని గోపిచంద్ చెప్పారు. స్పోర్ట్స్ గురించి మాత్రమే చర్చించామని..రాజకీయాల గురించి మాట్లాడలేదని తెలిపారు. అయితే ఈ మధ్య సినీ, రాజకీయ ప్రముఖులతో బీజేపీ నేతలు వరుసగా సమావేశం అవుతున్నారు. అమిత్ షా ఇప్పటికే ఎన్టీఆర్ తో సమావేశమవ్వగా.. జేపీ నడ్డా మిథాలీ రాజ్, నితిన్ భేటీ అయ్యారు.