అమిత్ షా సంగారెడ్డి టూర్ రద్దు

అమిత్ షా సంగారెడ్డి టూర్ రద్దు
  •     12న యథావిధిగా హకీంపేట్ సీఐఎస్ఎఫ్ పరేడ్ కు హాజరు 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంగారెడ్డి టూర్ రద్ద యింది. అయితే ఈ నెల 12 న హకీం పేట్ లో జరుగనున్న సీఐఎస్ఎఫ్ పరేడ్ కు మాత్రం ఆయన యథావిధిగా హాజర వుతున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన నేరుగా తిరువనం తపురం వెళ్లనున్నారు. ముందుగా నిర్ణ యించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా హకీంపేట్ ప్రోగ్రామ్ ముగించుకొని మధ్యాహ్నం బీజేపీ ఆధ్వర్యంలో సంగా రెడ్డిలో ఏర్పాటు చేసిన మేధావుల సమా వేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేరళలో అత్యవసర మీటింగ్ ఉండడం తో దీన్ని రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గా లు చెప్తున్నాయి. 11న రాత్రికి ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరు కుంటారు. అదే రోజు రాత్రి పార్టీ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.