రేపు హైదరాబాద్ విమోచన దినోత్సవం.. జెండా ఎగురవేయనున్న అమిత్ షా

రేపు హైదరాబాద్ విమోచన దినోత్సవం.. జెండా ఎగురవేయనున్న అమిత్ షా

రేపు (సెప్టెంబర్17న) హైదరాబాద్ విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. గతేడాది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాం.. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధర్వంలో అన్ని మంత్రిత్వ శాఖ సమన్వంతో నిర్వహిస్తామన్నారు కిషన్రెడ్డి.

రేపు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కవాతులో సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సంబంధించిన సంప్రదాయ కళారూపాల బృందాలు కూడా కవాతులో పాల్గొంటాయని తెలిపారు. 

హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానిస్తామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు షోయబుల్లా ఖాన్, గిరిజన సమరయోధుడు రామ్ జీ గోండులపై ప్రత్యేక పోస్టల్ కవర్లను విడుదల చేస్తారు. సాంస్కృతిక శాఖ ద్వారా వర్చువల్ ఎగ్జిబిషన్‌ను జాతికి అంకితం చేస్తామని చెప్పారు.