సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

ఫెడరలిజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కేరళలోని తిరువనంతపురంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కర్నాటక, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరుకాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఏపీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కౌన్సిల్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ లు సమావేశంలో పాలుపంచుకుంటున్నారు. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించేందుకు సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, వాటర్, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ, కోస్టల్ ఏరియా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి సహకారం తదితర అంశాలు మీటింగ్లో ప్రస్తావనకు రానున్నాయి.