అమిత్షాకు కాంగ్రెస్ కౌంటర్.. రాజ్యాంగాన్ని సమర్థిస్తే దేశ వ్యతిరేకమా?

అమిత్షాకు కాంగ్రెస్ కౌంటర్.. రాజ్యాంగాన్ని సమర్థిస్తే దేశ వ్యతిరేకమా?
  • అమిత్ షాకు కాంగ్రెస్ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లను కాంగ్రెస్ తప్పుపట్టింది. రాజ్యాంగాన్ని సమర్థించడం దేశ వ్యతిరేకమెలా అవుతుందో చెప్పాలని నిలదీసింది. బుధవారం కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం చీఫ్  పవన్ ఖేడా మీడియాతో  మాట్లాడారు. 

"మేం భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తూ మాట్లాడటం దేశ వ్యతిరేకమా? మరి మోదీ విదేశాలకు వెళ్లి భారతదేశంపైనా, భారత పౌరులపైనా వివాదాస్పద  కామెంట్లు చేయటం దేశ వ్యతిరేకం కాదా? రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడినప్పుడల్లా బీజేపీకి ఉలికిపాటు ఎందుకు? బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 

మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే డెమోక్రాట్ ఇల్హాన్ ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారనే ఆరోపణ అబద్ధం. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది కదా. అలాంటిదేమైనా అనిపిస్తే రాయబారిని పిలిపించి విచారించి చర్య తీసుకోవాలి" అని పవన్ ఖేడా పేర్కొన్నారు.