డ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా

డ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా

డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని లోక్‭సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సరిహద్దులు, ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ ప్రవేశాన్ని అరికట్టాలని  సూచించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్సీబీ, యాంటీ నార్కోటిక్ ఏజెన్సీలు ఒకే వ్యవస్థగా పనిచేయాలని చెప్పారు. డ్రగ్స్ విషయంలో తమ ప్రభుత్వం జీరో టోలరెన్స్ పాలసీని కలిగి ఉందని అమిత్ షా అన్నారు.  

డ్రగ్స్ ద్వారా వచ్చే లాభాలను ఉగ్రవాదానికి ఖర్చు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని.. అలాంటి దేశాల పట్ల కఠినంగా ఉంటామని ఆయన చెప్పారు. సరిహద్దుల ద్వారా డ్రగ్స్ రవాణాలు అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు.