
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ సిటీ, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవానీ అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని బైపాస్ కట్టరాంపూర్ సమీపంలోని బంజారాల ఆరాధ్య దైవం శీత్లా భవానీ అమ్మవారి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి కాంపౌండ్ నిర్మించడంతోపాటు బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజం బాగుండాలని, పశు పక్ష్యాదులు బాగుండాలని, పంటలు బాగా పండాలని మొక్కుతూ ఏడుగురు అమ్మవార్లకు మొక్కులు చెల్లించే పండుగే శీత్లా భవానీ ఉత్సవమన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన గురుద్వారా కమిటీ సభ్యులు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్ గురుద్వారా కొత్త కమిటీ మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురుద్వార అధ్యక్షునిగా ఎన్నికైన సర్దార్ హర్మీందర్ సింగ్, జనరల్ సెక్రటరీ సర్దార్ యస్పాల్ సింగ్‌కు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్, లీడర్ సర్దార్ రవీందర్ పాల్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.