నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్.. సింగరేణిని దోచుకున్నయ్: బండి సంజయ్

నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్..  సింగరేణిని దోచుకున్నయ్: బండి సంజయ్
  •     తెలంగాణ వచ్చాకే సంస్థలో దోపిడీ పెరిగింది: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ వచ్చాకే సింగరేణిలో ఎక్కువ దోపిడీ జరిగిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘‘సింగరేణి విషయంలో 2014 నుంచి జరిగిన అన్నింటిపై ఎంక్వైరీకి సిద్ధమా? అని హరీశ్​ రావుకు డిప్యూటీ సీఎం భట్టి సవాల్ ​చేస్తున్నారు. అంటే, ‘మా అక్రమాలు బయటపెడ్తే.. మీ అక్రమాలూ బయటపెడ్తాం’ అని ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలకులు సింగరేణిని తోడుదొంగల్లా దోచు కున్నట్టు అర్థమవుతున్నది.  

కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి నిధులు, గనుల కేటాయింపుపై వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేపర్ విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే సింగరేణిని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు విచ్చలవిడిగా దండుకుంటున్నారని దుయ్యబట్టారు. సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని అన్నారు. నైనీ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియతో పాటు 2014 నుంచి నేటి వరకు సింగరేణిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను తక్షణమే సీజ్ చేయాలని, లేదంటే ఆ రికార్డులను తారుమారు చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సంజయ్ చిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ చేశారు. సింగరేణి నిధులను బీఆర్ఎస్, కాంగ్రెస్ దారి మళ్లించాయని ఆయన​ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు సింగరేణి సొమ్ము రూ.42 వేల కోట్లు దారిమళ్లించి.. సంస్థను నష్టాల్లోకి నెట్టారు. జీతాల కోసం బ్యాంకుల వద్ద ఓడీ తెచ్చుకునే దుస్థితి కల్పించారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభా ల్లోకి తెస్తామనడం, అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారిమళ్లించడం ఈ రెండు పార్టీలకు అలవాటైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే’’ అని దుయ్యబట్టారు. సింగరేణి ఇష్యూను పక్కదారి పట్టించేందుకు వారం తర్వాత ఈ రెండు పార్టీలు మరో అంశాన్ని తెరపైకి తెస్తాయని అన్నారు.  

అందరూ సాక్షులేనా.. మరి దోషులెవరు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులెవరని సంజయ్ ప్రశ్నించారు. ‘‘ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే, విచారణకు పిలిచామని సజ్జనార్ చెబు తున్నారు. ఇందులో ఏది నిజం? ఫోన్ ట్యాపింగ్ కేసు లో కేటీఆర్, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీశ్​ సహా అందరినీ సాక్షులుగా పిలిస్తే.. మరి దోషులెవరు? దొంగలను సాక్షులుగా పిలవడమేంటి?’’ అని ప్రశ్నించారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి విచారణ చేస్తే, సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందని చెప్పారు. ‘‘అధికారంలో ఉన్నంత కాలం ప్రజల సొమ్మును దోచుకుని అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబానికి అన్నీ లొట్టపీసు కేసుల్లాగే కన్పి స్తాయి. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం” అని అన్నారు.  

కేసీఆర్, కేటీఆర్​ దేవుడి మీద ప్రమాణం చేస్తారా? 

ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ఇదే విషయాన్ని కుటుంబసభ్యుల తో కలిసి వచ్చి దేవుడి ముందు కేసీఆర్, కేటీఆర్ ప్రమా ణం చేసేందుకు సిద్ధమా?’’ అని సంజయ్ సవాల్ విసిరారు. ‘‘మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను చేర్చింది నిజం కాదా? ఆఖరికి బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించలేదా? ఇంకా సిగ్గులేకుండా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతారా?’’ అని ఫైర్​ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారని, మరి ఇప్పటి వరకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించా రు. ‘‘కాంగ్రెస్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బయటపడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో డ్రామాలాడుతున్నారు. కేటీఆర్ పెద్ద సంసారి అయినట్లు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎంత మంది జీవితాలను నాశనం చేశారో తెలియదా? ’’ అని మండిపడ్డారు. 

రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నరు.. 

2014కు ముందే రోహింగ్యాలు పాతబస్తీలోకి అక్రమంగా ప్రవేశించారని సంజయ్ అన్నారు. ‘‘అప్పటి నుంచి రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. బీఆర్ఎస్ హయాంలో నాటి హోంమంత్రి రోహింగ్యాలకు ఇండ్లు మంజూరు చేసి వాటిని ప్రారంభించారు. రాష్ట్ర పాలకులే ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు వంతపాడుతుంటే.. శాంతిభద్రతలను కాపాడేదెవరు?’’ అని ప్రశ్నించారు.