కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2026 మే 20న హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కొత్త పార్టీ పెట్టాలనే ఫాల్తూ ఆలోచన రాదని.. అలాంటి ఫాల్తూ నాయకుడిని కాదని అన్నారు. తను కమిట్మెంట్ తో పని చేసే కార్యకర్తనని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ చేతిలో 17 మంది ఎంపీలు ఉన్నారా..? కేసీఆర్ దయ, దాక్షిన్యాలు మీదనే మోడీ ప్రభుత్వం నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్ కు లేరు.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ ని భర్తరఫ్ చేయాలంటున్నారు.. కేసీఆర్ ను గద్దె దించాం కాబట్టి కేసీఆర్ కు ఆ కసి ఉంది అని అన్నారు. కేటీఆర్ తప్పుడు సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని విమర్శించారు
ALSO READ : కారు నడిపిన సీఎం విజయ్..
ఎవరెవరో ఏదో రాస్తూ ఉంటారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్ ఏంటో ప్రజలకు కార్యకర్తలకు తెలుసన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉందని.. కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన సందర్భం ఎక్కడైనా ఉందా? తను నిజాయితీగా ఆ పని చేశానని అన్నారు. ఫేక్ మీడియా ఫ్యాక్టరీలకు సమాధానాలు చెప్పాల్సిన పని లేదని ఈ సందర్భంగా అన్నారు.
