తమిళనాడు సీఎం విజయ్ పరిపాలనపై ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నారు. ఇచ్చిన హామీల అమలుతోపాటు అవసరం అయిన మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ.. వాటిని అమలు చేస్తున్నారు. చిన్న చిన్న అంశాలపై దృష్టి పెడుతూ.. వాటిని సెట్ రైట్ చేస్తున్నారు సీఎం విజయ్.
ఇందులో భాగంగానే గ్రామీణ వైద్య ఆరోగ్య సేవల కోసం.. గ్రామాల్లో వైద్య, ఆరోగ్య సేవల కోసం 40 మొబైల్ వెహికల్స్ ప్రారంభించారు సీఎం విజయ్. ఆయా వెహికల్స్ లో అత్యవసర మందులు, డాక్టర్, నర్సు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటాయి. వైద్య ఆరోగ్య సంచార వెహికల్స్ గ్రామాల్లో తిరుగుతున్న జనానికి అవసరం అయిన వైద్య సాయం చేయటంతోపాటు మందులను ఉచితంగా అందిస్తాయి.
మొదటి విడతలో భాగంగా 40 మొబైల్ హెల్త్ వెహికల్స్ ప్రారంభించి.. వాటి తాళాలను డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ స్వయంగా కారు నడిపారు. సచివాలయంలో ఓ కారు డ్రైవ్ చేశారు. తానే స్వయంగా కారులోకి ఎక్కి.. తానే స్టార్ట్ చేసి.. వాహనం ఎలా ఉంది.. ఆ వెహికల్ కండీషన్ ఏంటీ అనేది పరిశీలించారు.
సీఎం విజయ్ కారు నడుపుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎం అయిన తర్వాత కారు నడుపుతూ ఫస్ట్ టైం ఇలా కనిపించటం ఇదే. దీంతో ఫ్యాన్స్, టీవీకే కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు.
