కేటీఆర్కు జైలు తప్పదు:బండి సంజయ్

కేటీఆర్కు జైలు తప్పదు:బండి సంజయ్
  • రేవంత్ ఆ పనిచేస్తారనే నమ్మకం నాకుంది
  • కేటీఆర్ అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు
  • బీఆర్ఎస్, బీజేపీ మధ్య చర్యలు ఫేక్ న్యూస్
  • స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
  • కవిత బెయిల్  కు, బీజేపీకి ఏం సంబంధం
  • కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనయ్
  • రాష్ట్ర అధ్యక్ష మార్పు నడ్డా చూసుకుంటారు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ కు జైలు తప్పదని, ఆయన చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ను జైలుకు పంపే పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారని చెప్పారు. తనతోపాటు ఎందరో బీజేపీ కార్యకర్తలను నాయకులను కేటీఆర్ జైల్లో వేసి హింసించారని దానిని తానింకా మర్చిపోలేదని అన్నారు.

బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి ఫేక్ న్యూస్ అని అన్నారు. బీఆర్ఎస్ ఓ ఔట్ డేటెడ్ పార్టీఅని అన్నారు. కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అంటూ ప్రశ్నించారు. కోర్టు అంశాలను  పార్టీతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు.  రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ లకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు.

ఆర్ఎస్ కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ పోస్టింగులు ఇస్తునారని చెప్పారు.  బీఆర్ఎస్,  కాంగ్రెస్ పాలనక మధ్య  పెద్దగా తేడా ఏమీలేదని, అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని బండి సంజయ్ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. 

తమ్ముడికోసమే రేవంత్ ఢిల్లీ వెళ్లారనటం సరికాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడి కోసమే అమెరికా వెళ్లారనటం సరికాదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని, అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది వాళ్ల పై ఆధారపడి ఉంటుందని అన్నారు.

సదుద్దీన్ ఓ వైసీ ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.  గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చా లా చోట్ల కబ్జా చేశారని విమర్శించారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే అన్ని విషయాలు బయటికి వస్తాయని విరించారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేది జాతీయ అధ్యక్షుడు నడ్డా డిసైడ్ చేస్తారని అన్నారు.  అధినాయకత్వం నిర్ణయమే పార్టీకి శిరోధార్యమని చెప్పారు.