తెలంగాణకు సీఆర్‌‌‌‌‌‌‌‌ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ నిధులివ్వండి .. కేంద్ర మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీకి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వినతి

తెలంగాణకు సీఆర్‌‌‌‌‌‌‌‌ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ నిధులివ్వండి .. కేంద్ర మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీకి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వినతి
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌-జగిత్యాల రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెండింగ్ లో ఉన్న పలు రోడ్ల విస్తరణ పనుల ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ (సీఆర్‌‌‌‌‌‌‌‌ఐఎఫ్‌‌‌‌‌‌‌‌) రిలీజ్ చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌ లో ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌-– జగిత్యాల రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీని కలిసి మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్‌‌‌‌‌‌‌‌ఐఎఫ్‌‌‌‌‌‌‌‌, పలు రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సంజయ్ అందజేశారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట-ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌ రోడ్డులో భాగంగా మానేరు నదిపై హై లెవల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణం, గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి-–పోతూర్‌‌‌‌‌‌‌‌ రోడ్డు విస్తరణ, చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు, కిస్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణం, శంకరపట్నం మండలంలోని అర్కాండ్ల (గ్రామం) నుండి కన్నాపూర్‌‌‌‌‌‌‌‌ (గ్రామం) వరకు వరద కాలువపై హై లెవల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌- జగిత్యాల రోడ్డు విస్తరణ

ఈ భేటీలో భాగంగా గత ఎన్నికలకు ముందే కరీంనగర్‌‌‌‌‌‌‌‌– జగిత్యాల వరకు నాలుగు లేన్ల విస్తరణ కోసం కేంద్రం రూ.2,151. 35 కోట్ల నిధులతో ప్రపోజల్స్ తయారు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్​ గుర్తు చేశారు. ఆయా ప్రతిపాదనలకు ఆమోదం, టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చి నెలలు దాటుతున్నా నేటికీ టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. దీనిపై స్పందించిన గడ్కరీ.. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పిలిపించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్‌‌‌‌‌‌‌‌– జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామన్నారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే  టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను పూర్తి చేసి విస్తరణ పనులు ప్రారంభిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు సంజయ్ మీడియాకు వెల్లడించారు.