
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆగస్ట్ 8న (మధ్యాహ్నం12గంటలకు) సేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్న బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడిన్ ఆయన.. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. సిట్ లో అధికారులు స్వేచ్ఛగా పనిచేయడం లేదని ఆరోపించారు బండి సంజయ్. ఇదంతా టైంపాస్ వ్యవహారంలా అనిపిస్తోందన్నారు.
తన దగ్గర ఉన్న వివరాలు సిట్ కు అందజేస్తానన్నారు బండిసంజయ్. సిట్ విచారణపై గతంలోనే నోటీసులు అందాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై గతంతోనే ఫిర్యాదు చేశానని చెప్పారు. తెలంగాణలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదన్నారు బండి సంజయ్. కమిషన్ల రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు బండి సంజయ్.
ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ రోడ్డులోని దిల్‌కుషా గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీమ్ ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిట్సేకరించిన ఫోన్నంబర్ల లిస్ట్‌లో సంజయ్ పేరు
2023 ఎన్నికలు, అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్ పెద్దలు తన ఫోన్ ట్యాప్చేయించారని బండి సంజయ్పలుమార్లు ఆరోపించారు. అందుకు తగినట్లే సిట్సేకరించిన ఫోన్నంబర్ల లిస్టులో బండి సంజయ్ పేరు ఉంది. దీంతో ఆయనను స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు రావాలని సిట్ అధికారులు కోరారు