సికింద్రాబాద్ స్టేషన్​ రెనొవేషన్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలె

సికింద్రాబాద్ స్టేషన్​ రెనొవేషన్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలె
  • అధికారులకు రైల్వే మంత్రి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనొవేషన్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోశ్ ఆదేశించారు. రూ.700 కోట్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రెనొవేషన్ పనులు చేపట్టనున్న ఈ స్టేషన్ ను వచ్చే 40 ఏళ్ల వరకు ప్యాసింజర్స్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. బుధవారం సికింద్రాబాద్ స్టేషన్ ను తనిఖీ చేసిన మంత్రి..రెనొవేషన్ ప్లాన్​ను, పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. స్టేషన్​ను సందర్శించి వసతులపై ప్యాసింజర్స్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.10వ ఫ్లాట్ ఫాంపై ఉన్న చేనేత, కలంకారి ప్రొడక్ట్ స్టాల్​ను పరిశీలించారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్టేషన్ బయట ప్రాంతాలు, పార్కింగ్ ఏరియాతోపాటు స్టేషన్‌‌‌‌లోని అన్ని సౌలతులను కేంద్ర మంత్రి పరిశీలించారు. టీసీఏఎస్ (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్/ రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీ కొనకుండా ప్రమాదాన్ని నియంత్రించే వ్యవస్థ ) ను ఈ జోన్​లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని దర్శన జర్దోశ్ తెలిపారు. ఈ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జీఎం అరుణ్ కుమార్ జైన్, హైదరాబాద్, సికింద్రాబాద్ డీఆర్​ఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.