భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మోనోపలీకి అనుమతి లేదు..మస్క్ కామెంట్ల పై స్పందించిన కేంద్ర మంత్రి సింధియా

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మోనోపలీకి అనుమతి లేదు..మస్క్ కామెంట్ల పై స్పందించిన కేంద్ర మంత్రి సింధియా
  •     స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డుకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదని వెల్లడి

న్యూఢిల్లీ: భారతదేశంలో ఏ సెక్టార్​లోనూ ఒక కంపెనీకి గుత్తాధిపత్యం(మోనోపలీ) అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంపై కూడా ఏ సంస్థకు అజమాయిషీ ఇవ్వలేదని తేల్చిచెప్పారు. భారత్ లో తమ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్’ అడుగుపెట్టకుండా కొందరు దేశీయ పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారంటూ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఆరోపించారు. భారత నిబంధనలకు అనుగుణంగా ఐదేండ్లుగా తాము ప్రాసెస్ అంతా పూర్తిచేసినప్పటికీ కొందరు ఇండియాలో తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్ లింక్​కు లైసెన్సులు రాకుండా కుట్రలు చేస్తున్నారని మస్క్ విమర్శించారు. ఈ ఆరోపణలపై కేంద్ర కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ వేదికపై స్పందించారు.‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. భారత దేశం ఏ రంగంలోనూ ఒక ప్రైవేట్ కంపెనీకి గుత్తాధిపత్యాన్ని అనుమతించదు. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి కూడా కేవలం ఒక్క లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారును మాత్రమే ఎంపిక చేయలేదు. 

ఈ సేవలను అందించాలనుకునే ప్రతి ఒక్కరికీ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చాం. ప్రస్తుతం రిలయన్స్ జియో, వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెబ్, స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్ కంపెనీలు  లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పొందాయి. అమెజాన్ సంస్థ కూడా ఈ లైసెన్స్ రేసులో ఉంది. స్పెక్ట్రమ్  కేటాయింపులు, ధరల విధానంపై ట్రాయ్, టెలికాం శాఖలు తుది కసరత్తు చేస్తున్నాయి. అలాగే, అన్ని కంపెనీలు భద్రతాపరమైన ప్రమాణాలను విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే కంపెనీలు తమ కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి వీలవుతుంది. ఈ మూడు కంపెనీలను సమానంగా చూస్తున్నాం. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డుకట్ట వేస్తున్నారన్న ఆరోపణల్లో నిజంలేదు. ఎవరినీ ప్రత్యేకంగా అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు" అని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.