బీజేపీని గెలిపించాలనే కసి మీలో కనిపిస్తోంది

బీజేపీని గెలిపించాలనే కసి మీలో కనిపిస్తోంది

మెహిదీపట్నం/హైదరాబాద్, వెలుగు : ‘‘పాతబస్తీలో బీజేపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. బీజేపీని గెలిపించాలనే కసి మీలో కనిపిస్తోంది. ఇంకా కష్టపడి పార్టీని బలోపేతం చేయండి. కచ్చితంగా ఓల్డ్ సిటీలో బీజేపీయే గెలుస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అవుతుందని ప్రచారం చేయండి” అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన శనివారం చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్​ను సందర్శించారు. దళితులతో భేటీ అయ్యారు. తర్వాత ఓటు హక్కు ఎన్​రోల్ ​చేసుకున్న యువతతో మాట్లాడారు. మోడీ సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.