డైలీ వాకింగ్తో రోగాలు దూరం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

డైలీ వాకింగ్తో రోగాలు దూరం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: పరుగులు పెడుతున్న ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో మానసిక, శారీరక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మనిషి శ్రమకు దూరంగా ఉంటున్నారన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నడక ద్వారా శరీర దృఢత్వంతో పాటు అనేక రోగాలు రాకుండా ఉంటాయన్నారు.  వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నడక వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజల్లో తీసుకెళ్లి వారిని జాగృతం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ నడకను వారి జీవన శైలిలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కిషన్ రెడ్డి అవార్డులను ప్రదానం చేసి సన్మానించారు.