గ్లోబల్ సమిట్ సక్సెస్ కావాలి : రాంచందర్ రావు

గ్లోబల్ సమిట్ సక్సెస్ కావాలి :  రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'గ్లోబల్ సమిట్' కార్యక్రమాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్-–2047' లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తోందని, ఇందులో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కూడా అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు. సోమవారం ప్రారంభం కానున్న ఈ సదస్సుకు   కిషన్ రెడ్డి హాజరవుతారని  రావు వెల్లడించారు