70ఏళ్లుగా కశ్మీర్ లో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగింది

70ఏళ్లుగా కశ్మీర్ లో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగింది

కశ్మీర్ లో 70 ఏళ్లుగా రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ ప్రజలు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తారని చెప్పారు. ప్రస్తుతం కశ్మీర్ లో కర్ఫ్యూ సడలించినట్లు ఆయన చెప్పారు. లద్ధాక్ ప్రాంతం బౌద్ధులకు రెండో పుణ్య క్షేత్రంగా మారబోతుందన్నారు కిషన్ రెడ్డి. కశ్మీర్ లో మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. 70 ఏళ్లుగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కశ్మీర్ ప్రజలకు అమలు కాలేదు ఏ ఒక్కరికీ రిజర్వేష్లన్ల ఫలాలు అందలేదు తెలిపారు. ఇక మీదట అన్ని రిజర్వేషన్లు కశ్మీర్ ప్రజలకు దక్కుతాయని చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దాన్ని ఎదుర్కొనుందుకు భారత్ సిద్ధమని అన్నారు.