పౌరసత్వ బిల్లుతో ముస్లింలకు నష్టంలేదు: కిషన్ రెడ్డి

పౌరసత్వ బిల్లుతో ముస్లింలకు నష్టంలేదు: కిషన్ రెడ్డి

విద్యార్థులను మిస్ లీడ్ చేస్తున్న కాంగ్రెస్, కమ్మునిస్ట్ పార్టీలు…
నిరసన పేరుతో దాడులు చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు…
త్వరలో ఆందోళనలు తగ్గుముఖం పడతాయి…

భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన పనిలేదు: కిషన్ రెడ్డి

ఢిల్లీ: పౌరసత్వ బిల్లుతో దేశంలోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ లోని మైనారిటీలు భారత్ కు వచ్చేందుకు వీలుగా పౌరసత్వబిల్లు పనిచేస్తుందని చెప్పారు. అంతేకానీ భారతీయ ముస్లింలకు ఎలాంటి హాని చేయదని ఆయన అన్నారు.  శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్, కమ్యునిస్ట్ పార్టీలు కావాలనే మైనాటీ ప్రజలలో అలజడిరేపుతున్నాయని, విద్యార్థులను మిస్ లీడ్ చేస్తున్నయని చెప్పారు. ఆస్తినష్టం, దాడులకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెడుతామని ఆయన చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని త్వరలో ఆందోళనలు తగ్గుముఖం పడతాయని కిషన్ రెడ్డి చెప్పారు.