
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టుపై స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. చట్టం తన పని తానూ చేసుకుపోతుందన్నారు. కోర్టులు చట్ట ప్రకారమే నడుచుకుంటాయని… చిదంబరం అరెస్టులో తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులను కోర్టులే చూసుకుంటాయని ఆయన అన్నారు.