8కోట్ల కళ్లు ఈ రోజు కోసం ఎదురుచూశాయి

8కోట్ల కళ్లు ఈ రోజు కోసం ఎదురుచూశాయి

75ఏళ్లుగా ఏ పార్టీ తెలంగాణ విమోచనాన్ని చేయనివ్వడం లేదని.. మిగితా పార్టీల మెడలు వంచి విమోచన వేడుకలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..75ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న రోజు ఇవ్వాళ వచ్చిందన్నారు. 8కోట్ల కళ్లు ఈ రోజు కోసం ఎదురుచూశాయని..అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లాభాయ్ పటేల్ మొట్టమొదటి త్రివర్ణపతాకం ఎగురవేస్తే..74ఏళ్ల తర్వాత ఇప్పటి హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేశారని కిషన్ రెడ్డి తెలిపారు. అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షాకు ధన్యవాదాలు అని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలు కేంద్రం చర్యతో తూతూమంత్రంగా విమోచనం నిర్వహిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అయినా తమకు సంతోషమే అని..ఇన్నాళ్లు అవి కూడా నిర్వహించలేదని విమర్శించారు.