2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : కిషన్ రెడ్డి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : కిషన్ రెడ్డి

ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 13వ తేదీ గురువారం సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్రీయ రోజ్‌గార్ మేళాలో కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నూతనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారాయన. దేశంలో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని..కానీ 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు కిషన్ రెడ్డి. యువశక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు.  ఎడ్యుకేషన్ పాలసీలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామని..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం అవతరించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. యువత తమ మేధస్సు ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటుందనేది ముఖ్యం కాదు.. వ్యవస్థలు ముఖ్యమని తెలిపారు. 2040 నాటికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాలని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్, వైద్య రంగాల్లో ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నామన్న కిషన్ రెడ్డి.. ఈ ఏడాది దేశంలో 31 కోట్ల సెల్ ఫోన్స్ మన దేశం ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగమతి చేస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి అన్ని రంగాల్లో పెట్టుబడులు రావాల్సివుందన్నారు.

తెలంగాణలో రూ.1 లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారాయన. సిఫార్సులకు తావులేకుండా ట్రాన్సఫరెన్స్ గా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టం చేశారు. కొంత మంది ముఖ్యమంత్రులు సచివాలయానికి కూడా రారు..ప్రధాని మోడీ మాత్రం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశారని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి.

https://youtu.be/B-kMopyNSCY