తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది

తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది

ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్లు పెట్టిందని.. ఇవాళ పేపర్లలో కావాలని ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందని అసదుద్దీన్ అంటున్నారన్న కిషన్ రెడ్డి.. ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు. నెలలో 20రోజులు సీఎం ఫాంహౌజ్ లోనే ఉంటారని.. కేబినెట్ మీటింగ్ లో కాకుండా.. డైనింగ్ టేబుల్ మీదనే ఆయన నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. 

తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతుందని..రాష్ట్రంలో బీజేపీ ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం, మోడీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. తాము కేసీఆర్ కుటుంబానికి జవాబుదారీ కాదని చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కోట్లు ఖర్చుపెట్టిన బీజేపీ గెలిచిందన్నారు. వాస్తు పేరుతో కేసీఆర్ కొత్త ఇల్లు కట్టుకున్నారని..మొదటి ఐదేళ్లు తెలంగాణలో మహిళా మంత్రే లేదని అన్నారు.  దేశంలో అన్ని రాష్టాల కంటే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువున్నాయని మండిపడ్డారు.