
హామీల అమలులో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో గారడీ చేశారని విమర్శించారు.
Also Read :- బీఆర్ఎస్ కు క్యాడర్ లేదు ..లీడర్లు గోపీలయ్యారు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు. దివాళాకోరు, దాగాకోరు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని చెప్పారు.