
గాంధీ హాస్పిటల్ లో చాలామంది పేషంట్స్ ధైర్యంతో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైద్యులు కూడా అదే ధైర్యం తో పని చేస్తున్నారన్నారు. 110 సవత్సరాల వయసు గల రామానంద తీర్థ వ్యక్తి కోవిడ్ నుంచి కొలుకున్నాడని.. మనో ధైర్యం గాంధీ సేవలే అతన్ని బతికించాయన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ పై గాంధీ వైద్యులతో రివ్యూ నిర్వహించారు కిషన్ రెడ్డి. హాస్పిటల్ లో ప్రధాన మంత్రి పీఎం కేర్ కింద 2 ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటి నుంచి నిమిషానికి 2 వేల లిటర్స్ ఆక్సిజన్ వస్తుందన్నారు. హాస్పిటల్ లో 500 వెంటిలేటర్స్ ఉన్నాయని...ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది లేని కారణంగా 50 వెంటిలేటర్స్ నిరుపయోగంగా ఉన్నాయన్నారు. స్టాఫ్ ను యుద్ధ ప్రాధిపధికాన రిక్రూట్ చెయ్యాలని చెప్పారు.