ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి

విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం విజయవాడకు వచ్చిన ఆయన ఉదయమే ఇంద్రకీలాద్రికి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందానికి ఆలయ ఈవో సురేస్ బాబు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి.

కరోనా మహమ్మారి నుండి ప్రజలు అందరూ బయటపడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని కోరానని చెప్పారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదగాలని, దేశ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. కేంద్ర మంత్రి వెంట ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ థియోధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.