
భారతదేశ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి ప్రధాని మోడీ చాటి చెబుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అటు జీ20 సమావేశాల గురించి తెలియని వ్యక్తులు..ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని శాశించేవి జీ20 సమావేశాలని చెప్పారు. హైదరాబాద్ మారియట్ హోటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకేర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియా జీ20 ప్రెసిడెన్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటివరకు 54 నగరాల్లో 250 సమావేశాలు జరిగాయని కిషన్ రెడ్డి చెప్పారు.
నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు కనిపిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. నేషనల్ హైవేస్లో రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. తక్కువ రేటుకే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్లో యుద్దం జరుగుతుంటే.. 22,500 మంది భారతీయ విద్యార్థులను.. ఫారెన్ పాలసీ ద్వారా ఇక్కడికి రప్పించామని గుర్తు చేశారు.