ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి సతీమణి

ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి సతీమణి

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న  ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి రాఖీ కట్టారు. స్వీట్ తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువులకు దూరంగా ఉదయం నుంచి డ్యూటీలో నిమ్మగ్నమై విధులు నిర్వర్తిస్తున్న తన దగ్గరకు కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సంతోషం వ్యక్తం చేశాడు.