కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉంచాలన్న కేంద్ర మంత్రి రాణే

కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉంచాలన్న కేంద్ర మంత్రి రాణే

మహారాష్ట్రలో త్వరలోనే మార్పు చూడబోతున్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. ఈ మార్పు మార్చి కల్లా చూస్తారని, ఉన్న గవర్నమెంట్‌ కూలడమో, కొత్త గవర్నమెంట్ ఏర్పడడమో ఏదో ఒకటి జరగబోతోందని ఆయన చెప్పారు. జైపూర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఏర్పడే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. కొన్ని విషయాలను సీక్రెట్‌గానే ఉంచాలని రాణే అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఆరోగ్యం బాగోలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇప్పుడు ఆ విషయం మాట్లాడొద్దని చెప్పారని అన్నారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ఉద్ధవ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ సర్కారు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోదని రాణే చెప్పారు.

కాగా, రెండు వారాల క్రితం శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్ హాస్పిటల్‌లో వెన్నెముక సర్జరీ జరిగింది. ఈ సమయంలో మాజీ శివసేన నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే.. మహా సర్కారు త్వరలో కూలిపోనుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది.