5 ఏండ్లలో 414 కి.మీ. ఎన్ హెచ్​లు పూర్తి : నితిన్ గడ్కరీ

5 ఏండ్లలో 414 కి.మీ. ఎన్ హెచ్​లు పూర్తి : నితిన్ గడ్కరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేషనల్ హై వేస్ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. గత 5 ఏండ్లలో రాష్ట్రంలో కేవలం 414 కిలో మీటర్ల నేషనల్ హైవేస్ మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ కు వెల్లడించిన అధికారిక లెక్కలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. సగటున నెలకు 7 కిమీ రోడ్ మాత్రమే పూర్తయింది. పక్క రాష్ర్టం అయిన ఏపీలో 777 కి.మీ. రోడ్లు పూర్తయ్యాయి. ఈ లెక్కలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గత 10 ఏండ్లలో లక్షల కోట్ల నిధులు తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని పేర్కొంటున్న బీజేపీ నేతలు ఈ లెక్కలపై ఏం చెబుతారని 
ప్రశ్నిస్తున్నారు.  


ఇయర్     పూర్తయిన రోడ్ల 
    లెంత్ (కి.మీ.లలో)
2019‑20    48.36
202 0‑21    84.6
2021‑22    108.07
2022‑23    99.54
2023‑24     73.81