
సికింద్రాబాద్: 1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ ప్రాంతానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక సంవత్సరం తరువాత 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
కళాకారులు సాంస్కృతీక కార్యక్రమాల ప్రదర్శనలు ఇస్తున్నారు. సెంట్రల్ హోం మినిస్టిర్ అమిత్ షా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. రాజసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి ఈ వేడుకలు హాజరైయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీకి 74వ పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
‘హైదరాబాద్ సంస్థానానికి విమోచన జరిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన దేశ భక్తుడని కొనియాడారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో రజాకర్లు తెలంగాణ ప్రజలను పెట్టిన బాధలు గుర్తుకు వస్తే నా రక్తం సలసలా మసులుతుంది. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. సామాన్య ముస్లింకు వ్యతిరేకం కాదు.. రజాకార్ల పార్టీకి మాత్రమే వ్యతిరేకం. తెలంగాణ విమోచక్ష దినోత్సవం పాటించకుండా ప్రజా పాలన ఎవరి కోసం పాటిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎం కోసమే కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా చెప్తోందని’ బండి సంజయ్ అన్నారు.