
తెలంగాణ ప్రభుత్వం ఆధ్యర్యంలో ఘనంగా ప్రజాపాలనా దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ నిజాము... పిశాచమా అంటూ మొదలు పెట్టారు. గడిచిన పదేళ్లలో ఓ నియంత పాలన కొనసాగిందన్నారు.
తెలంగాణ అస్థిత్వం అంటే ... తమ కుటుంబ అస్థత్వం అన్న రీతిలో గత పాలకులు భావించారు. తెలంగాణ లో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం చేశారన్నారు. నేను ఫాంహౌస్ సీఎం ను కాదు.. పనిచేసే సీఎంను అని రేవంత్ అన్నారు . నాఢిల్లీ పర్యటనపై కూడాఈ విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ భారతదేశంలోనే ఉంది.. బంగ్లాదేశ్‌లో లేదన్నారు. కేంద్రం నుంచి రావలసిన ప్రతి పైసా తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తెలంగాణ బానిస సంకెళ్లను తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ప్రజాపాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ అన్నారు.ఒక ప్రాంతానికో.. ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదన్న సీఎం.. సెప్టెంబర్ 17 ను కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారన్నారు.
ఇది తెలంగాణ ప్రజల విజయం.. రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్ అన్నారు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగం చేశారు. నిజాం రాజరిక వ్యవస్థను పారదోలిన గడ్డ .. తెలంగాణ గడ్డ అన్నారు. ఒక జాతి తన స్వేచ్చ కోసం రాజరిక పోకడపై గళం ఎత్తిందన్నారు. నిజాంను మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయాన్ని గత పాలకులు విస్మరించారని.. కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.