దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దు: పిల్లలపై కేంద్ర మంత్రి ధీమా

దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దు: పిల్లలపై కేంద్ర మంత్రి ధీమా

దీపావళి పండుగ అంటే అమావాస్య నాడు విరిసే దీపాల కాంతులు. అంతేనా.. క్రాకర్స్ కాల్చి పండుగ చేసుకోనిదే దీపావళి పూర్తి కానట్టని కొందరు ఫీల్ అవుతారు.

ఈ టపాకాయల వల్ల పర్యావరణానికి తీవ్రంగా హాని జరుగుతోంది. ఆ రోజు శబ్ద కాలుష్యంతో పాటు పండుగ తర్వాతి రోజంతా కూడా గాలి ప్యూరిటీ బాగా తగ్గిపోతోంది.

ఈ విషయాలపై రెండు మూడేళ్లుగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. వీటికి ప్రస్తుతం ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది.

కేంద్ర మంత్రి జవదేకర్ పిలుపు

కేంద్ర మంత్రి జవదేకర్

దీపావళి నాడు క్రాకర్స్ కాల్చొద్దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. టపాకాయలు కొనొద్దని పిల్లలే తల్లిదండ్రులను కోరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ, తప్పనిసరిగా క్రాకర్స్ కాల్చాలనుకుంటే ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ క్రాకర్స్ కొనాలని సూచించారాయన. ఈ రకమైన టపాకాయలను మార్కెట్ లోకి తెచ్చిన కేంద్ర సాంకేతిక శాస్త్ర మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తీసుకున్న గొప్ప చారిత్రాత్మక ఇనిషియేటివ్ అని అన్నారు.

 30 శాతం తక్కువ కాలుష్యం

కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్టియల్ రీసెర్స్ (సీఎస్ఐఆర్) పరిశోధనల ద్వారా గ్రీన్ క్రాకర్స్ ను తయారు చేసింది. ఈ క్రాకర్స్ ను శుక్రవారం కేంద్ర మంత్రి సాంకేతిక శాస్త్ర మంత్రి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. వీటిని దేశ వ్యాప్తంగా మార్కెట్ లోకి తెస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 కంపెనీలకు వీటిని సీఎస్ఐఆర్ అమ్ముతుందని చెప్పారాయన. మార్కెట్ లో ఉండే సాధారణ టపాకాయలతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువగా కాలుష్యాన్ని విడుదల చేస్తాయని హర్షవర్ధన్ చెప్పారు.