ఎంతో దూరం లేదు.. పీవోకే దానికదే భారత్‎లో కలుస్తది: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

ఎంతో దూరం లేదు.. పీవోకే దానికదే భారత్‎లో కలుస్తది: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

మొరాకో: పాకిస్తాన్‌‌‌‌ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌(పీవోకే) దానంతట అదే మన దేశంలో కలుస్తుందని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చెప్పారు. మన దేశం ఎటువంటి యుద్ధాలు, దూకుడు చర్యలు తీసుకోకుండానే పీవోకే తిరిగి స్వాధీనం అవుతుందని అన్నారు. అందుకు ఎంతో దూరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడి ప్రజలు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని, ఆ నినాదాలు జనాల్లోంచి వినిపిస్తున్నాయని చెప్పారు. రెండ్రోజుల మొరాకో పర్యటనలో ఉన్న రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌.. సోమవారం అక్కడి ఇండియన్‌‌‌‌ కమ్యూనిటీతో ముచ్చటిస్తూ ఈ కామెంట్లు చేశారు. 

తాను ఐదేండ్ల కింద కూడా ఆర్మీ సమావేశంలో ప్రసంగిస్తూ ఇదే విషయం చెప్పానని గుర్తుచేశారు. ‘‘పీవోకే మనదే అవుతుంది. మనం దాడి చేసి పీవోకేను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికి మనదే. పీవోకేనే నేను భారత్‌‌‌‌లో భాగమని చెప్తుంది. అందుకు ఎంతో దూరం లేదు” అని ఆర్మీతో చెప్పినట్లు రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌గుర్తుచేశారు.

ప్రస్తుతం పీవోకే నుంచి విముక్తి కోరుతూ అక్కడి ప్రజలు చేస్తున్న డిమాండ్లు మీరు విని ఉండాలని ఇండియన్‌‌‌‌ కమ్యూనిటీనుద్దేశించి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ అన్నారు. ట్రంప్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లపై ఎందుకు స్పందించలేదంటే.. అమెరికా ప్రెసిడెంట్‌‌‌ ట్రంప్‌‌‌‌ విధిస్తున్న టారిఫ్‌‌‌‌లపై మన దేశం ఇప్పటివరకు ఎందుకు అధికారికంగా స్పందించలేదని ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నకు రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌సింగ్‌‌‌‌జవాబిస్తూ.. విశాల దృక్పథం కలిగిన విధానాన్ని మనం పాటిస్తున్నామని చెప్పారు.