సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఆలోచన లేదు

సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఆలోచన లేదు
  • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికిలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రెసిడెంట్, ప్రధానిసహా సగం ప్రభుత్వం ట్విట్టర్​లో ఉందని, కేంద్రం ఎంత న్యాయంగా ఉందో ఈ విషయమే చెబుతోందన్నారు. సోషల్ మీడియా సంస్థలు లోకల్ రూల్స్​ను పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. రూల్స్ పాటించకపోవడం వల్లే ట్విట్టర్ ఇంటర్ మీడియరీ హోదా కోల్పోయిందన్నారు. ‘వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్యాపిటల్ హిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేసినప్పుడు.. అప్పటి అధ్యక్షుడితో సహా అందరి ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేస్తారు. కానీ రైతుల స్ట్రైక్​ టైమ్​లో ఎర్రకోటపై టెర్రరిస్టుల సపోర్టర్లు కత్తులు చూపుతూ, పోలీసులను గాయపరిస్తే.. అది భావ ప్రకటనా స్వేచ్ఛనా? లడఖ్​ను చైనాలో భాగంగా చూపిస్తారు. దాన్ని తొలగించాలని మిమ్మల్ని అడిగేందుకు మాకు 15 రోజులు పడుతుంది. ఇది న్యాయం కాదు. ప్రజాస్వామ్యంలో ఇండియా తన డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సమాన అర్హత కలిగి ఉంది’ అని స్పష్టంచేశారు. ఐటీ రూల్స్​కు వ్యతిరేకంగా లీగల్​గా వెళ్తున్న వాట్సాప్ గురించి స్పందిస్తూ.. సాధారణ పౌరులంతా వాట్సాప్ వాడకం కొనసాగించవచ్చని తెలిపారు.